మా గురించి

Created with Sketch.

వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC)-వరంగల్ -తెలంగాణ

వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC)-వరంగల్ -తెలంగాణ పరమశివున్ని ప్రసన్నం చేసుకొని చిరంజీవియైన భక్తగ్రేసురుడు శ్రీ మార్కండేయ మహర్షి వారసులం మన పద్మశాలి కులస్తులం. ఆయన చూపిన బాటలో విలువలతో ప్రయాణిస్తూ ప్రపంచానికి వలువలందిస్తూ మన ధర్మాన్ని నిష్ఠతో ఆచరిస్తూన్నవాళ్ళం. భారతదేశంలో అనేక కులాలున్నప్పటికీ దేని ప్రత్యేకత దానిదే. అట్లే మన కులం ప్రత్యేకత కూడా... వరంగల్ మహానగరంలో వాస్తవంగా మన పద్మశాలి కులస్తుల సంఖ్య చాలా ఎక్కువ. మన కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా బలపడితే మహాశక్తిగా అవతరిస్తారు. అలాంటి ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి. కానీ మాలగా అల్లినకొద్దీ విడిపూలలా మనం విడిపోతూనే ఉన్నాం. అలా కాకుండా ఐక్యతా బంధమనే దారంతో గట్టిగా ముడివేసి అందమైన పూలమాలలా పద్మశాలి కులస్తులందరినీ ఒకే వేదిక పై తీసుకువచ్చే తపనతో ''వరంగల్ పద్మశాలి క్లబ్'' (WPC) ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈసుంద, అద్భుత ఆలోచనకు మూలకారకులు, మన కులబాంధవులు శ్రీ రామ శ్రీనివాస్ గారు . వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో శ్రీ రామ శ్రీనివాస్ గారు జన్మించారు. వారు 35 సం॥లుగా హైద్రాబాద్లో వ్యాపారరీత్యా స్థిరపడ్డారు. పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే తపనతో వరంగల్ నగరంలో April 2016 సం॥ల "మోక్షరామం ఫౌండేషన్"ను స్థాపించి రామన్నపేటలో "అమ్మఒడి" పేరిట 3 అంతస్థుల భవనం నిర్మించి ఇక్కడి నుండి ఫౌండేషన్ ద్వారా ఎన్నోరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా పరంపరలో భాగంగా మన పద్మశాలి కులస్తుల ఐకమత్యమే ఏకైక అక్ష్యంగా కులపెద్దలందరితో "అమ్మఒడి" లో పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి వారితో సమాలోచనలు జరిపి, సలహాలు తీసుకొని, ఏకాభిప్రాయంతో "వరంగల్ పద్మశాలి క్లబ్" (WPC)ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర్రంలో పాత ఉమ్మడి 10 జిల్లాలో అన్ని జిల్లాల్లో కంటే లత్యధిక పద్మశాలి జనాభా కలిగిన జిల్లా మన వరంగల్ జిల్లా. సుమారు 1 లక్ష కులుంబాలు మన జిల్లాలో (6 కొత్త జిల్లాలు) ఉంటాయని ఒక ప్రాధమిక అంచానా. అందులో నుండి 2000 మంది సభ్యులతో భారతదేశంలోనే ఒక అగ్రగామియైన క్లబ్గా అందర్జాతీయ స్థాయిలో మన "వరంగల్ పద్మశాలి క్లబ్" (WPC)ను తీర్చిదిద్దబోతున్నాం. వరంగల్ మహానగరంలో వాస్తవంగా మన పద్మశాలి కులస్థుల సంఖ్య చాల ఎక్కువ .మన కులస్థులందరు ఏకతాటిపైకి వచ్చి సమిష్టి గ బలపడితే మహాశక్తిగా అవతరిస్తారు . అలాంటి ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి .కానీ మాలగా అల్లినకొద్దీ విడి పూలలా మనం విడిపోతూనే ఉన్నాం . ఆలా కాకుండా ఐక్యతా బంధమనే దారంతో గట్టిగా ముడివేసి అందమైన పూలమాలలా పద్మశాలి కులస్థులందరిని ఒకే వేదికపై తీసుకువచ్చే తపనతో ''వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC)" ను ఏర్పాటు చేసుకోబోతున్నం .ఈ సుందర అద్భుత ఆలోచనకు మూలకారకులు మన కులభాందవులు శ్రీ రామ శ్రీనివాస్ గారు . వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో శ్రీ రామ శ్రీనివాస్ గారు జన్మించారు .వారు 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లో వ్యాపారరీత్యా స్థిరపడ్డారు .పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే తపనతో వరంగల్ నగరంలో మూడున్నర సంవస్త్సరాల క్రితం "మోక్షరామం ఫౌండేషన్ " ను స్థాపించి రామన్నపేటలో "అమ్మఒడి" పేరిట ౩ అంతస్తులు భవనం నిర్మించి ఇక్కడినుండి ఫౌండేషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు . ఈ సేవా పరంపరలో భాగంగా మన పద్మశాలి కులస్థుల ఐకమత్యమే ఏకైక లక్ష్యంగా కులపెద్దరందరితో "అమ్మఒడి " లో పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి వారితో సమాలోచనలు జరిపి ,సలహాలు తీసుకోని ఏకాభిప్రాయంతో "వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC) ను ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది . తెలంగాణ రాష్ట్రంలోని పాత ఉమ్మడి 10 జిల్లాలో అన్ని జిల్లాల కంటే అత్యధిక పద్మశాలి జనాభా కలిగిన జిల్లా మన వరంగల్ జిల్లా .సుమారు 1 లక్ష కుటుంబాలు మన జిల్లాలో (6 కొత్త జిల్లాలు ) ఉంటాయని ఒక ప్రాధమిక అంచనా .అందులోనుండి 2000 మంది సభ్యులతో భారతదేశంలోనే ఒక అగ్రగామియైన క్లబ్ గా అంతర్జాతీయ స్థాయిలో మన "వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC)" ను తీర్చిదిద్దుతున్నాం

ఇండోర్ అవుట్ డోర్ అటలు

ఇండోర్ -అవుట్ డోర్ ఆటలు : వరంగల్ పద్మశాలి క్లబ్ ప్రధాన లక్ష్యం పద్మశాలి కులస్థులందరూ పరస్పరం పరిచయం కావడం .కలిసి మెలిసి సమాజంలో ముందుకు సాగడం .అందుకోసం మనం నిర్మించబోయే క్లబ్ నందు ఒలింపిక్ స్థాయిలో సర్వహంగులతో ఒక స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేయబోతున్నాము.ఇండోర్ ఆటలైన షటిల్ ,బాడ్మింటన్ ,టేబుల్ టెన్నిస్ లకు ప్రత్యేక కోర్టులు అవుట్ డోర్ ఆటలైన వాలీబాల్ ,బాస్కెట్బాల్ వంటి ఆటలకు ప్రత్యేక కోర్టులు నిర్మించబోతున్నాము. ఇక బిలియర్డ్స్ ,స్క్వాష్ వంటి ఆటలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నాం ఇటువంటి ఆటలకు ఇప్పటి వరకు హైద్రాబాదు వంటి మహానగరాలే కేంద్ర స్థానాలుగా ఉన్నాయ్ ,ఆర్ధికంగా ఉన్నవారు మాత్రమే అక్కడికి వెళ్లి ఆటలాడుకొని ఆనందంగా గడుపుతున్నారు , ఇకపై అటువంటి ఆటలు సౌకర్యాలను మన క్లబ్ ద్వారా వరంగల్ మహానగరంలోకి అందుబాటులో తీసుకవస్తున్నాం .

ఎ/సి జిమ్

A/C జిమ్: ప్రపంచస్థాయి వ్యాయమ వస్తువులతో ఎయిర్ కండిషన్డ్ జిమ్ ను మన పద్మశాలి కులస్థులతో క్లబ్ ద్వారా అందుబాటులోకి తీసుకరాబోతున్నాం .ఈ జిమ్ లో పురుషులకు ,స్త్రీలకు వేర్వేరు సమయాలు కేటాయించబడుతాయి .యోగా,మెడిటేషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను అందుబాటులో ఉంచనున్నాం . పద్మశాలి కులబాంధవుల సంపూర్ణ ఆరోగ్యమే మన క్లబ్ లక్ష్యం .

ఎ/సి బాంకెట్ హాల్స్ / మీటింగ్ హాల్స్

మన వరంగల్ పద్మశాలి క్లబ్ నిర్మాణంలో భాగంగా 2 A/C బాంక్వేట్ హాల్స్ నిర్మించబోతున్నాం. 50-200 మంది కూర్చునేలా చిన్న చిన్న వేడుకలు జరుపుకునేలా వీటిని తయారు చెయ్యబోతున్నాం. ఇవి కేవలం పద్మశాలి కులస్తులకు మాత్రమే బాంక్వెట్ హాల్స్ గాని బార్ & రెస్టారెంట్ గాని వరంగల్ పద్మశాలి క్లబ్ మెంబెర్సకు మాత్రమే. మెంబెర్లతో పాటు వారి మిత్రులకు, బంధువులకు తీసుకువచుకునే వెసులుబాటు కల్పించడం కూడా జరుగుతుంది. క్లబ్ లోకి ఇతరులు ప్రవేశించడానికి వీలు లేకుండా బాంక్వెట్ హాల్స్ కు, బార్ & రాస్తారెంటుకు వేర్వేరు దార్లు నిర్మించడం జరుగుతుంద

ఎ/సి బార్ & ఫ్యామిలీ రెస్టారెంట్

మన క్లబ్ ఆధ్వర్యంలో అదే ఆవరణలో ఒక A/C బార్ & రెస్టారెంటును,టిఫిన్ ,భోజన సదుపాయాలు గల ఫ్యామిలీ రెస్టారెంటును నిర్మించబోతున్నాం.అందులోని ప్రతి వస్తువు ఇతర ప్రదేశాలకంటే చౌకగా లభించే ఏర్పాట్లు చెయ్యబోతున్నాం.ఆహార పదార్దాలు రుచి ,శుచిగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. పూర్తిగా లాభాపేక్ష లేకుండా దీని నిర్వహణ జరుగుతుంది .ఇందులోకి వచ్చే మన పద్మశాలీ కులస్తుల మధ్య విస్తృత పరిచయాలు ఏర్పడతాయి

ఆదివారం బఫే భోజనం

మన పద్మశాలి కుటుంబాల మధ్య పరిచయాలు విరివిగా పెరుగు,బహుళ లాభదాయకంగా మారడానికి వీలుగా ప్రతి ఆదివారం క్లబ్ సభ్యుల సభ్యుల కోసం కేటాయించుకుంటాం.నామమాత్రపు ధరలకే అందరికి ఆహార పదార్దాలు(లంచ్) అందజేస్తాం.దీంతో మనుషులు దగ్గరవుతారు.పిల్లలు , పెద్దలు మాట్లాడుకుంటారు ,స్నేహం చేస్తారు. బంధుత్వం కలుపుకుంటారు. ఇది బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది. మన పిల్లల పెళ్లి సంబంధాలకు ఇది ఒక గొప్ప వేధికావుతుంది. కుటుంబాల గురుంచి తెలుసుకోవడానికి,సంబంధాలు కలుపుకోవడానికి మన క్లబ్ గొప్ప వేదిక కల్పిస్తుంది.

సూట్ గదులు / సాధారణ గదులు

మన పద్మశాలి కులస్తుల పిల్లలు కష్టపడి చదువుచున్న మూలంగా మన దేశంలోనే కాకుండా బయట దేశాలలో కూడా ఉద్యోగాలు సంపాదించుకొంటున్నారు. అప్పుడప్పుడు వారు భార్య ,పిల్లలను తీసుకొని మన వరంగల్ కు వస్తుంటారు. తల్లిదండ్రుల వద్దకు వచ్చే పద్మశాలి పిల్లలకు అన్ని ఆధునిక వసతులతో కూడిన సూట్ రూంలు బాగా ఉపయోగపడతాయని నిర్మిస్తున్నాం.అట్లే ఇక్కడున్నటువంటి మన వరంగల్ పద్మశాలి క్లబ్(WPC) మెంబర్లు అవసరాలకు కూడా. ఈ సూట్ రూంలను వదుకునేలా సిద్ధం చెయ్యబోతున్నాం 2000 మెంబరుషిప్ లలో కొన్నిటిని మన పద్మశాలి NRI ల కోసం ప్రత్యేకంగా కేటాయించబోతున్నాం వాటి సంఖ్య పరిమితంగా ఉంటుంది.

క్లబ్ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం

మన వరంగల్ జిల్లాలో పద్మశాలి కులానికి చెందిన అనేక మంది సేవా సంపన్నులైన వైద్యులున్నారు వారికి మనం మన క్లబ్ లో వసతి కల్పించడం ద్వారా వారి సేవలందుకోవడానికి వీలున్నది. మెంబర్లకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చెయ్యడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. రోగ నిర్దారణ పరీక్షలలో వారి హాస్పిటల్స్ నందు రహితీలు ఇవ్వడానికి, పేదలకు ఉచితంగా వైద్య సేవాలందించడానికి వారు సుముఖంగా ఉన్నారు

క్లబ్ సభ్యులకు ఉచిత న్యాయ సలహా

మన పద్మశాలి క్లబ్ బందువులందరికి ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడానికి మన న్యాయకోవిదులు కూడా ముందుకు వస్తున్నారు. మెంబెర్లందరికి వారు కావలసిన సహకారాన్ని అందజేస్తారు. మన కులంలోని పేదలకు సంబందించిన కేసులను కూడా వారు ఉచితంగా వాదిస్తామని ముందుకు రావడం క్లబ్ కు సంతోషం కలిగించే అంశం. ఇందుకోసం న్యాయవాద సేవలకై ప్రత్యేక వసతి కల్పించబడుతుంది

మహిళలకు వినోద దినం

వారంలో ఒక రోజును తగిన రక్షణ చర్యలతో మన క్లబ్ లో మహిళలు, పిల్లల కోసం కేటాహించుకుంటాం. ఆ రోజు పురుషులకు ప్రవేశం ఉండదు.క్లబ్ నిర్వాహకులుగా కూడా ఆ రోజు మహిళలే ఉంటారు.దీని వలన మహిళలు,పిల్లలు ఎటువంటి బిడియం, సంకోచం లేకుండా స్విమ్మింగ్ చెయ్యవచ్చు.వివిధ రకాల ఆటలు ఆడుకోవచ్చు అనందహోత్సహాలతో గడపవచ్చు,వరంగల్ పద్మశాలి క్లబ్ మెంబర్లు కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ సదవకాశం

పద్మశాలి లైబ్రరీ మరియు డిజిటల్ లైబ్రరీ

మన పద్మశాలీల చరిత్ర వంశవృక్షము గోత్రములు మహనీయులకు సంబంధించిన గాథలు తెలియజేసే విధంగా పద్మశాలీల కు సంబంధించిన పలు పుస్తకాలు సమాహారంతో కూర్చిన లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నాం ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తయారవుతున్న మెంబర్ల పిల్లలు చదువుకోవటానికి వీలుగా వారికి అవసరమైన పుస్తకాలను కూడా అందులో పొందుపరచబోతున్నాం

ట్రావెల్ డెస్క్

ట్రావెల్ డెస్క్ మన పద్మశాలి బంధుమిత్రులు దేశవిదేశాల నుండి వివిధ ప్రాంతాల నుండి వరంగల్ కు నిత్యం వస్తుంటారు కుటుంబ సభ్యులను కలవడానికి ఓరుగల్లును సందర్శించడానికి వ్యాపారం కోసం వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు మన వరంగల్ పద్మశాలి క్లబ్ డబ్ల్యూ పిసి లో ట్రావెల్ స్కూలు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం ఎక్కడెక్కడ నుండి వచ్చే వారికి ప్రయాణించడానికి రూమ్స్ తో పాటు వారు ప్రయాణించడానికి వీలుగా వెహికిల్స్ ఏర్పాటు చేస్తున్నాం పర్యాటక ప్రాంతాలు మరియు ట్రిప్ కు సంబంధించిన సలహాలు మొదలగునవి అత్యంత అందుబాటు ధరలో అందించడం

క్లబ్ డిమాండ్ ప్రదర్శన గోడ

క్లబ్ డిమాండ్ వాల్ వరంగల్ పద్మశాలి క్లబ్లో డిమాండ్ వాల్ ఏర్పాటు చేసుకున్నాం ఈ డిమాండ్ వాల్పై మన పద్మశాలి కులానికి సంబంధించిన ఇంజనీర్లు డాక్టర్లు జర్నలిస్టులు ఎడిటర్లు న్యాయవాదులు పోలీసులు ఆర్కిటెక్ట్ బట్టల వ్యాపారం బంగారం వ్యాపారులు గృహనిర్మాణ వ్యాపారులు స్టీల్ వ్యాపారులు కిరణ్ వ్యాపారులు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ విద్యాసంస్థలు సెల్ నెంబర్ తో సహా రాసి ఉంచబడతాయి మన క్లబ్ సభ్యులందరూ వారి అవసరాలను మన కులస్తులను నుండి తీర్చుకునే అవకాశం కలుగుతుంది వ్యాపారం అంటే అమ్మడం కొనడం మన కులస్తుల మధ్యనే జరుగుతుంది దాంతో మనకు తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు లభిస్తాయి మన కులస్తులు బాగుపడతారు ఇటువంటి అలవాటు ప్రపంచవ్యాప్తంగా చాలా వర్గాలలో నిరంతరం జరుగుతున్నది మనము ఆచరించి ఇతర కులాలకు ఆదర్శంగా నిలుద్దాం

సాంస్కృతిక పండుగలు

WPC (వరంగల్ పద్మశాలి క్లబ్) లో మన రాష్ట్ర మరియు జాతీయ పండుగలను జరుపుకునేందుకు నిర్ణయించుకోవడం జరిగింది
ఉదాహరణకు: సంక్రాంతి , శివరాత్రి హోళి పండుగ ఉగాది శ్రీరామనవమి రక్షా బంధము (రాఖీ) శ్రీ కృష్ణ జన్మాష్టమి బోనాల పండుగ వినాయక చవితి బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగ దసరా జమ్మి పూజ దీపావళి కొమ్మ పున్నమి గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవం తెలంగాణ రాష్ట్ర దినోత్సవం ఇతర ముఖ్యమైన సందర్భంలలో పండుగలను పద్మశాలి ఐక్యతను తెలుపుటకు  మన WPC ఆవరణలో మాత్రమే జరుపుకుంటాం

Open chat
1
Welcome to WPC (Warangal Padmashali Club)
How can i Help you..!
Powered by