
పరమశివున్ని ప్రసన్నం చేసుకొని చిరంజీవియైన భక్తాగ్రేసరుడు శ్రీ మార్కండేయ మహర్షి వారసులం మన పద్మశాలి కులస్థులం.అయన చూపిన బాటలో విలువలతో ప్రయాణిస్తూ ప్రపంచానికి విలువలందిస్తూ మన ధర్మాన్ని నిష్ఠతో ఆచరిస్తున్న వాళ్ళం . భారత దేశంలో అనేక కులాలున్నప్పటికీ దేని ప్రత్యేకత దానిదే . అట్లే మన కులం ప్రత్యేకత కూడా…. వరంగల్ మహానగరంలో వాస్తవంగా మన పద్మశాలి కులస్థుల సంఖ్య చాల ఎక్కువ .మన కులస్థులందరు ఏకతాటిపైకి వచ్చి సమిష్టి గ బలపడితే మహాశక్తిగా అవతరిస్తారు . అలాంటి ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి .కానీ మాలగా అల్లినకొద్దీ విడి పూలలా మనం విడిపోతూనే ఉన్నాం . ఆలా కాకుండా ఐక్యతా బంధమనే దారంతో గట్టిగా ముడివేసి అందమైన పూలమాలలా పద్మశాలి కులస్థులందరిని ఒకే వేదికపై తీసుకువచ్చే తపనతో ”వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC)” ను ఏర్పాటు చేసుకోబోతున్నం .ఈ సుందర అద్భుత ఆలోచనకు మూలకారకులు మన కులభాందవులు శ్రీ రామ శ్రీనివాస్ గారు . వరంగల్ జిల్లాలోని రామన్నపేటలో శ్రీ రామ శ్రీనివాస్ గారు జన్మించారు .వారు 30 సంవత్సరాలుగా హైదరాబాద్ లో వ్యాపారరీత్యా స్థిరపడ్డారు .పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే తపనతో వరంగల్ నగరంలో మూడున్నర సంవస్త్సరాల క్రితం “మోక్షారామం ఫౌండేషన్ ” ను స్థాపించి రామన్నపేటలో “అమ్మఒడి” పేరిట ౩ అంతస్తులు భవనం నిర్మించి ఇక్కడినుండి ఫౌండేషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు . ఈ సేవా పరంపరలో భాగంగా మన పద్మశాలి కులస్థుల ఐకమత్యమే ఏకైక లక్ష్యంగా కులపెద్దరందరితో “అమ్మఒడి ” లో పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి వారితో సమాలోచనలు జరిపి ,సలహాలు తీసుకోని ఏకాభిప్రాయంతో “వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC) ను ఏర్పాటు చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది . తెలంగాణ రాష్ట్రంలోని పాత ఉమ్మడి 10 జిల్లాలో అన్ని జిల్లాల కంటే అత్యధిక పద్మశాలి జనాభా కలిగిన జిల్లా మన వరంగల్ జిల్లా .సుమారు 1 లక్ష కుటుంబాలు మన జిల్లాలో (6 కొత్త జిల్లాలు ) ఉంటాయని ఒక ప్రాధమిక అంచనా .అందులోనుండి 2000 మంది సభ్యులతో భారతదేశంలోనే ఒక అగ్రగామియైన క్లబ్ గా అంతర్జాతీయ స్థాయిలో మన “వరంగల్ పద్మశాలి క్లబ్ (WPC)” ను తీర్చిదిద్దుతున్నాం